వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు ములుగు జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ సూచనల ప్రకారం భూపాలపల్లి మండలం ములుగు నియోజకవర్గం లోని పెద్దాపూర్ గ్రామంలో డి ఆర్ డి ఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆశ జ్యోతి గ్రామ సమైక్య సంఘం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ములుగు జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బైరెడ్డి భగవాన్ రెడ్డి గురువారం.ప్రారంభించారు.పెద్దాపూర్ గ్రామంలోని గోపయ్యపల్లిలో మరో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని,
బాసింగ్ పల్లి, గుర్రంపేట గ్రామలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ములుగు జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బైరెడ్డి భగవాన్ రెడ్డి, వెంకటాపూర్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బండి శ్రీనివాస్ భూపాలపల్లి మండల ప్యాక్స్ చైర్మన్ మేకల సంపత్ లు పాల్గొని ప్రారంభించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..వరికి కనీస మద్దతు ధర ఏ గ్రేడ్ రకం క్వింటాల్ కు రూ. 2320, సాధారణ రకం క్వింటన్ కు రూ.2300 ఉందన్నారు….కాంగ్రెస్ ప్రజా పాలనలో రైతన్నను రాజును చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఎల్లవేళలా పనిచేస్తుందన్నారు..కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఏకకాలంలో 2 లక్షల రైతు రుణాలు మాఫి చేసిందని,.రైతులకు ఇచ్చిన మాట ప్రకారం సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తుందన్నారు ఈ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం కార్యక్రమంలో ములుగు జిల్లా అధికార ప్రతినిధి కోడూరు రమేష్, వెంకటాపూర్ మండల యూత్ అధ్యక్షుడు కట్టెకోళ్ల వెంకటేష్, భూపాలపల్లి జిల్లా మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు యం డి షుకూర్, పెద్దాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడు మామిళ్ళ రాజు, బాసింగ్ పల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు బొడ్డు రామయ్య,, సుబ్బక్కపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు ధరంసోత్ గోవింద్ నాయక్, గుర్రంపేట గ్రామ కమిటీ అధ్యక్షుడు జీడి రాజు, పెద్దాపూర్ మహిళ గ్రామ కమిటీ అధ్యక్షురాలు మూల స్రవంతి, మండల ప్రధాన కార్యదర్శి చెరుకు కుమార్, రాష్ట్ర, మండల, గ్రామాల కాంగ్రెస్ నాయకులు , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యువజన నాయకులు, మహిళ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, మహిళా నాయకులు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, వ్యవసాయ రైతులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here