వరంగల్ పోలీసులకు కరోనా ఫీవర్

పోలీసులను వెంటాడుతున్న కరోన భయం
నగరంలోని ఓ పోలీస్ స్టేషన్లో నలుగురికి కరోన పాజిటివ్
ఇద్దరు ఎస్సై లతోసహ నలుగురు క్వారెంటైన్ లోకి
మరో పోలీస్ స్టేషన్లో ఎస్సై, రైటర్ కు కరోన పాజిటివ్
కరోన భయంతో పొలీస్ స్టేషన్ల ముందు జాగ్రత్తలు చెపుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన పోలీసులు

వరంగల్ పోలీసులకు కరోనా ఫీవర్- news10.app

వరంగల్ తూర్పు న్యూస్10

కరోనా కోవిడ్(19) వైరస్ పేరు వింటేనే దేశ ప్రజల గుండెల్లో భయం పుట్టుకొస్తుంది ఈ వైరస్ బారిన పడి దేశం మొత్తంలో కొన్ని వేల మంది బలి కావాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ మహమ్మారి గ్రేటర్ వరంగల్ నగరంలో విస్తరిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో పోలీస్ సిబ్బందిని కరోనా ఫీవర్ (భయం) వెంటాడుతోంది ట్రై సిటీస్ లో ఉన్న పోలీస్ స్టేషన్ లలో బ్యానర్ లు వెలిశాయి. స్టేషన్ లో పని చేస్తున్నకొంత మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ లక్షణాలు బయటపడ్డట్టు సమాచారం విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే స్పందించి పోలీస్ స్టేషన్ లో హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించి సిబ్బంది కి పరీక్షలు నిర్వహించారు.

అందులో పాజిటివ్ లక్షణాలు కనపడిన వారిని తగు జాగ్రత్తలు వహిస్తూ క్వారెంటిన్ కి పంపుతూ పై అధికారులకు కూడా పరీక్షలు నిర్వహించి స్వచ్చందంగా ఇంట్లోనే ఉండాలని సూచించినట్టు తెలిసింది. వరంగల్ పోలీస్ కనేషనరేట్ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ లకు వైద్య అధికారులు హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేయించారు. ముందస్తుగా కొన్ని పోలీస్ స్టేషన్ లల్లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై స్థాయి అధికారులు ఇంట్లోనే ఉంటూ తగు జాగ్రత్తలు వహిస్తున్నట్టు తెలిసింది. ఠాణా కి వచ్చే పిర్యాదు దారులను కూడా ఒక్కరికే ప్రవేశం ఉండాలని మొహానికి మాస్క్ ధరించి చేతులు శుభ్రం చేస్తేనే ఠాణా లో ప్రవేశం ఉంటుందని బ్యానర్ లు పోలీస్ స్టేషన్ ల పై వెలిశాయి పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న సిబ్బంది ఒకరికి పాజిటివ్ లక్షణాలు వచ్చాయని తెలియగానే స్టేషన్ సిబ్బంది మొత్తం భయాందోళనకు గురి అవుతున్నారు.