జనగామ నియోజకవర్గం పై ఎమ్మెల్సి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కన్నేసినట్లు తెలుస్తోంది…గులాబీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,మంత్రి కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న పోచంపల్లి శ్రీనివాసరెడ్డి రానున్న ఎన్నికల్లో జనగామ నియోజకవర్గం.నుంచి పోటీ చేయడం ఖాయమని,అధిష్టానం ఆదేశిస్తే తాను పోటీచేయడానికి సిద్ధంగా ఉన్నట్టు పోచంపల్లి సైతం తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు సమాచారం…కాగా పోటీలో దిగే యోచనలో ఉన్న పోచంపల్లి ఇప్పటికే నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నాయకులతో,యువతతో టచ్ లో ఉన్నట్లు సమాచారం….తనకు టికెట్ రావడం కోసం పోచంపల్లి అధిష్టానం వద్ద పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది…..అంతేకాదు జనగామ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే సామాజిక వర్గం ,పోచంపల్లి సామాజిక వర్గం ఒకటే కావడంతో గులాబీ అధిష్టానం సైతం టికెట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు గులాబీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది….అంతేకాదు గులాబీలో ప్రస్తుతం.ఎమ్మెల్యే గా కొనసాగుతున్న పోచంపల్లి జనగామ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలకు తన ఎమ్మెల్సీ కోటానుంచి నిధులు సైతం మంజూరి చేస్తున్నట్లు జనగామ లో గులాబీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది… అంతేకాదు జనగామ లో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పై ఉన్న వ్యతిరేకత తనకు కలిసి వస్తుందని పోచంపల్లి బావిస్తుండగా.. జనగాంలో భూ కబ్జాలు ఇతర ఆరోపణలు బాగానే ఉండడంతో ఈసారి ఎన్నికల్లో ఆయనకు టికెట్ విషయంలో అధిష్టానం మొండి చెయ్యి చూపుతుందని ఈ నేపథ్యంలో పోచంపల్లి కి టికెట్ ఖాయంగా కనపడుతుందని గులాబీలోనే ఇప్పుడో చర్చ జరుగుతుంది…మొత్తానికి జనగామ నియోజకవర్గం నుంచి టికెట్ కోసం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి బాగానే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది… చివరకు పోచంపల్లి ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాలి…