ఆరూరి కంటతడి

బి ఆర్ ఎస్ ను వీడి బీజేపీ లో చేరబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇంటి వద్ద మంగళవారం హై డ్రామా చోటుచేసుకుంది…. బీజేపీ చేరిక అంశంపై మీడియాకు క్లారిటీ ఇవ్వడం కోసం హన్మకొండలోని ఆయన నివాసంలో సమావేశం ఏర్పాటు చేయగా…సమావేశం ప్రారంభం కాకముందే అక్కడకు బి ఆర్ ఎస్ కు చెందిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, మాజీ కుడా ఛైర్మెన్ సుందర్ రాజు,నాగుర్ల వెంకన్న చేరుకున్నారు… ఆరూరి తన నిర్ణయాన్ని ప్రకటించకుండానే ఆయనను బుజ్జగించిన బి ఆర్ ఎస్ నేతలు కారులో తమవెంట తీసుకెళ్లారు…బి ఆర్ ఎస్ లో కొనసాగిన పార్టీ ఎం పి టికెట్ ఇచ్చిన మళ్ళీ వారే ఓడగొడతారని ఆరూరి అనుచరులు బి ఆర్ ఎస్ లో కొనసాగేందుకు ససేమిరా అంటూ వారు నినదించారు… ఒక దశలో మాజీ మంత్రి ఎర్రబెల్లి వాహనాన్ని అడ్డుకుని స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు…కాగా బి ఆర్ ఎస్ నేతలు ఆరూరి తో మాట్లాడుతూ బుజ్జగించే సమయంలో ఆయన భావోద్వాగానికి గురయ్యారు… కంటతడి పెట్టారు…అన్న వద్దు మళ్ళీ ఒడిస్తారు అని కార్యకర్తలు అనడంతో ఆయన ఆలోచనలో పడ్డారు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here