ఆయన తిట్టాడు…మీరు తిట్టరా…?
అధికారిక కార్యక్రమంలో పాల్గొని కోట్ల రూపాయలతో నిర్మించిన నిర్మించబోయే అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ ప్రారంభోత్సవాలు,శంకుస్థాపనలు చేశారు….పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సభలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు…. ఈ సభలోనే కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు గురుంచి కాకుండా…రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామంటే రాష్ట్ర ప్రభుత్వం తమకు సహకరించడం లేదని అన్నారు… పనిలో పనిగా కుటుంబ పాలన,అవినీతి అంటూ కేసీఆర్ కుటుంబానికి,రాష్ట్ర సర్కార్ కు బాగానే చురకలు అంటించారు…రాష్ట్రంలో అవినీతిని అరికడతామని హామీ సైతం ఇచ్చారు ప్రధాని మోదీ… అధికారిక కార్యక్రమంలో మోదీ ప్రసంగం మొత్తం రాష్ట్ర ప్రభుత్వాన్ని,కేసీఆర్ ను టార్గెట్ చేయగా ఈ ప్రసంగం బీజేపీ శ్రేణులను ఉత్సాహ పరిచినట్లు ఐయింది…ఇక తమ బాస్ మోదీ కేసీఆర్ పరోక్షంగా విరుచుకుపడ్డారు తామెందుకు ఊరుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేసీఆర్ పై సెటైర్లు మొదలుపెట్టారు…. కేసిఆర్ మోదీ సభకు హాజరైతే తాము సన్మానం చేసి కప్పుదాం అనుకున్న చేనేత శాలువా ఇదిగో…సభకు రాకుండా మంచి శాలువా మిస్ ఐయావు కదా కేసీఆర్ అంటూ బండి సంజయ్ ఓ విమర్శ చేశారు….ఇది పస ఉన్న విమర్శ కాదా అనే విషయాన్ని పక్కన పెడితే చిన్న చిన్న విషయాలను తెరపైకి తెచ్చి ఎదో విమర్శించాలి కదా అన్న ధోరణిలో విమర్శలకు దిగుతూ ఎవరి స్థాయిని వారే చేతులారా దిగజార్చుకుంటున్నారనేది మాత్రం వాస్తవం…ఇక మోడీ సభ తర్వాత ఆయన చేసిన విమర్శలను ఎండగడుతూ రాష్ట్ర మంత్రులు కొందరు ప్రెస్ మీట్ లో తమకు చేతనైనంత ఏకి పారేశారు…మోదీ అబద్దాలు చెప్పారు…తెలంగాణకు వచ్చి విషం కక్కారు అంటూ విమర్శలు చేశారు…అయితే ఈ రివెంజ్ విమర్శలు…తిట్ల దండకాలు కొన్ని మీడియా సంస్థలతో సహా కొందరు రాజకీయ నాయకులకు సరిపోలేదట…మోదీ అంతగా చురకలు అంటిస్తే కేసీఆర్ ఏంటి సైలెంట్ గా ఉన్నారు…?కేటీఆర్,కవిత లు ఎందుకు మాట్లాడడం లేదు….?కేసీఆర్ రియాక్షన్ చాలా తీవ్రస్థాయిలో ఉంటుంది అనుకున్నాం ఎం లేదు కదా…వంటి ధర్మ సందేహాలు వారిలో బయలుదేరాయి …అలా కలిగిన సందేహాలను ఎలాగూ ప్రచారంలో పెట్టి తామే ఫస్ట్ కనిపెట్టాం అని ప్రచారం చేసుకోవాలి కనుక ఎక్కడ వీలైతే అక్కడ సోషల్ మీడియాతో సహా ప్రచారంలో పెట్టేసారు…..అంతేకాదు కొందరైతే ఓ అడుగు ముందుకు వేసి కేసీఆర్, కేటీఆర్ లు మోదీ వ్యాఖ్యలపై ఎం మాట్లాడకపోయేసరికి బి ఆర్ ఎస్ శ్రేణులు అయోమయానికి గురైతున్నారని వీరే పెద్ద అయోమయానికి గురై పోయారు…..మోదీ తిట్టి పోయారు మీరు తిట్టరా…? అన్నట్లు వీరి విశ్లేషణలు బయలుదేరాయి …తిట్ల పురాణాలను ప్రచారంలో పెడితే కొద్ది రోజులు పనిదొరుకుతుంది అనుకున్నారేమో వీరు…అలా జరగకపోవడంతో అలా ఎందుకు జరగలేదు అనే చర్చ లో వీరు ఇప్పుడు బిజీగా ఉన్నారట.. అవును మరి తెలంగాణ రాజకీయాల్లో ప్రతికారాలు,తిట్ల పురాణాలు, పనికిమాలిన విమర్శలు బాగా పెరిగిపోతుంటే ఎప్పుడో ఓసారి అందుకు భిన్నంగా రాజకీయ నాయకులు ప్రవర్తిస్తే అయ్యో ఇలా జరిగిందేంటని జీర్ణించుకునే వారు లేకుండా పోతున్నారు….తిట్టుకు తిట్టు కావాలని కోరుకునేవారే పెరిగిపోతున్నారు……అంతే మరి రాజకీయమా వర్ధిల్లు….