తవ్వుకునోళ్ళకు….తవ్వుకున్నంత
అడిగే దిక్కు లేదు…ఆపే దమ్ము లేదు
ప్రభుత్వ పనితో కొందరు…నాయకుల అండతో మరికొందరు
వరంగల్ ఉమ్మడి జిల్లాలో అడ్డగోలు మొరం తవ్వకాలు
అధికారుల టేకిట్ ఈజీ పాలసీ…ఎంత తవ్విన వారి కళ్ళకు కనపడదు…
ఎండాకాలం షూరువైందో లేదు మొరం దందాకు తెరలేపారు కొందరు….తవ్వుకునోళ్ళకు తవ్వుకునంత అన్నట్లు అడ్డగోలుగా మొరం తవ్వకాలు జరుపుతూ దేఖో మై దందా అంటూ కొందరు ఫోజులు కొడుతున్నారు….ప్రభుత్వ అభివృద్ధి పనుల పేరిట గోరంత అనుమతులు తీసుకొని వాటిని చూపెడుతూ కొండంత తవ్వకాలు జరుపుతూ ఇచ్చిన క్యూబిక్ మీటర్ల అనుమతికి తవ్విన దానికి ఏమాత్రం పొంతన లేకుండా దందా కొందరు నడుపుతుండగా…ఇంకొందరు ప్రజాప్రతినిధుల సహకారంతో అడ్డగోలు తవ్వకాలు చేస్తూ దండిగానే దండుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి…ఇంతకీ గుట్టలను,చెరువులను మొరం కోసం అడ్డగోలుగా తవ్వుతున్న దెవరు…..?
న్యూస్10
సాయంత్రం సంచికలో